వందేమాతరంపై ఎస్పీ నేత వివాదాస్పద కామెంట్స్

వందేమాతరంపై ఎస్పీ నేత వివాదాస్పద కామెంట్స్

'వందేమాతరం గేయం' సామూహిక ఆలాపణపై సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబు అసిమ్ అజ్మీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా బలవంతంగా ఏదైనా చదవమని తప్పనిసరి చేయడం సరికాదని వందేమాతరం గేయాన్ని ఉద్దేశించి అజ్మీ అన్నారు. ఇస్లాం ప్రకారం, అసలైన ముస్లిం అల్లాను తప్ప.. తల్లి‌ సహా మరెవరినీ పూజించకూడదని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.