VIDEO: రోడ్డెక్కిన మదిరే గ్రామస్థులు
KRNL: ఆదోని మండలాల విభజనలో మదిరే గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని కొత్తగా ఏర్పడిన పెద్ద హరివాణం మండలంలో కలపడాన్ని నిరసిస్తూ ఆదివారం సిరుగుప్ప ప్రధాన హైవే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కర్ణాటక శివారులో ఉన్న పెద్ద హరివాణంలో పరిపాలన ఎలా సాధ్యమని వారు అసహనం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని తిరిగి ఆదోనిలోనే కలపాలని ఆందోళన చేశారు.