VIDEO: స్కూల్లో నీటి ఊట.. విద్యార్థులకు ఇబ్బందులు

VIDEO: స్కూల్లో నీటి ఊట.. విద్యార్థులకు ఇబ్బందులు

TPT: తిరుపతి బాలాజీ కాలనీ పోలీస్ క్వార్టర్స్ వెనుకనున్న మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో నీటి ఊట ఏర్పడటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రవహిస్తున్న నీరు తరగతి గదుల్లోకి చేరడంతో కొన్ని గదులను మూసివేయాల్సి వచ్చింది. ఈ సమస్యపై ఉన్నతాధికారులకు పలుమార్లు వినతులు చేసినా స్పందన లేకపోవడాన్ని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.