నేడు కోవెలకుంట్లకు మంత్రి బీసీ రాక

NDL: కోవెలకుంట్లలో మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఇవాళ వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీకి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రానున్నారని మండల వ్యవసాయ అధికారి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం క్రింద లబ్ధిదారులకు సబ్సిడీపై పరికరాలు ఇస్తున్నారని ఏవో చెప్పారు. ఈ సమావేశానికి అధికారులు రైతులు హాజరు కావాలని కోరారు.