'ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలి'

'ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలి'

BHNG: భూమిలేని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి రూ.12,000 “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” అందిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆలేరులోని సుందరయ్య భవనంలో జరిగిన సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.