ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళ మృతి

ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళ మృతి

కృష్ణా: పెనమలూరు మండలం తాడిగడప సెంటర్ వద్ద సోమవారం ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళ మృతిచెందింది. ఉయ్యూరు నుంచి తాడిగడపకు రాయి లోడ్‌తో వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతురాలు పెద్ద ఒగిరాలకి చెందిన రాధారాణి స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.