గుండుబా స్థావరాలపై దాడి చేసిన పోలీసులు
JN: పోలీసులు గుండుబా స్థావరాలపై దాడి చేసి 200 లీటర్ల బెల్లం పానకాన్ని, మూడు లీటర్ల గుడుంబాని స్వాధీనం చేసుకున్న ఘటన దేవరుప్పుల మండలం పొట్టిగుట్ట తండాలో శుక్రవారం జరిగింది. తండాలో గుడుంబా తయారీ జరుగుతుందన్న నమ్మదగిన సమాచారంతో దాడి చేసినట్లు ఎస్సై సృజన్ కుమార్ అన్నారు. ఇంకా ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.