ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు.. పలు విమానాలు రద్దు

ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు.. పలు విమానాలు రద్దు

విమాన సర్వీసులపై ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడుల ప్రభావం పడింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతర్‌కు వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. ఐరోపా దేశాలకు వెళ్లాల్సిన 6 విమాన సర్వీసులను ఈరోజు రాత్రి 11:59 గంటల వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. మరోవైపు దుబాయ్, షార్జా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు స్పెస్‌జెట్ తెలిపింది.