'ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అమలు చేయాలి'

BDK: ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభ చర్ల మండల కేంద్రంలో శనివారం రైతు వేదికలో నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యను కొనసాగించాలని అన్నారు.