గల్ఫ్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంపై US అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తామని వెల్లడించారు. ఇరాన్‌లో అన్ని లక్ష్యాలను ఛేదించామని, ఆ దేశం దగ్గర ఇంకేమీ మిగల్లేదని పేర్కొన్నారు. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ఆగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య గత నెల 28 నుంచి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.