రమణయ్య కుటుంబీకులకు బుగ్గన పరామర్శ

రమణయ్య కుటుంబీకులకు బుగ్గన పరామర్శ

NDL: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం డోన్ పట్టణంలోని రైతు మిత్ర కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొచేర్వు రమణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల రమణయ్య బాబాయి మృతిచెందగా, ఇవాళ వారి నివాసానికి వెళ్లి సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామని బుగ్గన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.