'పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి'
SRPT: ఆత్మకూరు (ఎస్) మండల పరిధిలోని కందగట్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోనగిరి సంధ్యారాణి వీరన్న, వార్డు సభ్యులను గెలిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు సోమవారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. గ్రామ పంచాయతీకి మెజారిటీ నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయన్నారు.