గుంతకల్లు శివారులో దట్టమైన పొగ మంచు
ATP: గుంతకల్లు పట్టణ శివారులో ఆదివారం పొగ మంచు కప్పేసింది. ఉదయం 8 అవుతున్నా మంచు తగ్గకపోవడంతో రోడ్డుపై ప్రయాణాలు చేయడానికి ప్రజలకు కష్టంగా మారింది.పొలాలకు వెళ్లిన రైతులు సైతం దట్టమైన పొగ మంచు కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.