కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం

కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం

ELR: కొయ్యలగూడెం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం కూటమి నాయకుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే స్త్రీ శక్తి పథకం బహిరంగ సభ విజయవంతం అయ్యేలా విస్తృతమైన ఏర్పాట్లపై చర్చ జరిగింది. కూటమి తరఫున సమావేశానికి హాజరైన నాయకులు, ఏడు మండలాల అధికారులతో కలిసి వేదిక నిర్మాణం, రవాణా సౌకర్యాలు, తాగునీరు, పార్కింగ్, భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.