కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన జిల్లా కలెక్టర్
ATP: అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో విధి నిర్వహణలో పలు కారణాల వలన మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఓ.ఆనంద్ కారుణ్య నియామకాల ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు తమకు ఆర్థిక భరోసానిచ్చిందని తెలిపారు.