కుల్సుంపురా సీఐపై సస్పెన్షన్ వేటు
HYD: హైదరాబాద్‌లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ సీఐ సునీల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ కేసు విషయంలో నిందితుల పేర్లను మార్చి.. వారికి సీఐ ఫేవర్ చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నట్లు కుల్సుంపురా ఏసీపీ మునావర్ తెలిపారు.