సీఎం పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

సీఎం పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

TG: ఆదిలాబాద్‌లో ఏప్రిల్ 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పిప్రిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ క్రమంలో ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు ఏ దశకు చేరుకున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.