తిరువూరు పరిధిలో పశువులకు నీటితొట్టెలు ఏర్పాటు
NTR: వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని మూగజీవాలు, పశువుల దాహం తీర్చేందుకు గ్రామ పంచాయతీల సహకారంతో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వావిలాల, రాజుగూడెం, మునుకుళ్ళ, వామకుంట్ల, లక్ష్మీపురం, రామన్నపాలెం, కాకర్ల, కోకిలంపాడు, మల్లెల గ్రామాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఆవులు, మేకలతో పాటు పక్షుల కోసం కూడా ఈ నీటి వసతి కల్పించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.