వరదల సమయంలో రెడ్‌క్రాస్ సేవలు మరువలేనివి: కలెక్టర్
BPT: రెడ్‌క్రాస్ వార్షిక సమావేశం బుధవారం బాపట్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల కలెక్టర్ వెంకట మురళి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రికార్డు స్థాయిలో రెడ్‌క్రాస్ తన సేవలు అందిస్తుందని కొనియాడారు. వరదల సమయంలో రెడ్ క్రాస్ చేసిన సేవలు అభినందనీయమన్నారు. సంస్థ సేవల్లో జిల్లాకు మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు.