రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు కలెక్టర్
VZM: జిల్లాలో వాయుగుండం ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున, సోమవారం నిర్వహించాల్సిన పీ.జి. ఆర్. ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ముందుస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చేవారం పీ. జీ. ఆర్. ఎస్ యధావిధిగా జరుగుతుందన్నారు.