'ముగ్గురిపై ఎక్స్‌ట్రాషన్ కేసులు నమోదు చేశాం'

'ముగ్గురిపై ఎక్స్‌ట్రాషన్ కేసులు నమోదు చేశాం'

ASF: కాగజ్ నగర్ మండలం ఈజ్ గావ్ పోలీస్ స్టేషన్ పరిధి అందేవల్లిలో ట్రాక్టర్ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిపై ఎక్స్‌ట్రాషన్ కేసులు నమోదు చేసినట్లు SP నితిక పంత్ తెలిపారు. అందేవేల్లిలో ఒక్కరు, రాసపల్లిలో ఇద్దరు వ్యక్తులు డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.