కీసరలో 20 వరకు కార్తిక మాస ఉత్సవాలు
MDCL: తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కీసర భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక మాస ఉత్సవాలు నవంబర్ 20 వరకు వైభవంగా జరుగనున్నాయి. భక్తుల కోసం ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్తిక వనభోజనాలు చేసుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది.