భారత్‌లోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ: కేంద్రమంత్రి

భారత్‌లోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ: కేంద్రమంత్రి

ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అందులో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. వీరిలో ఎక్కువ మంది 18-44 మధ్య వయస్కులేనని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి రూ.40 వేల కోట్లు ఖర్చుతో వాటిని తొలగించామని చెప్పారు.