రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PPM: కురుపాం మండలం, ఉదయపురం-కలిగొట్టు బీటీ రహదారి పునర్నిర్మాణానికి సోమవారం కురుపాం MLA తోయక జగదీశ్వరి శకుస్థాపన చేశారు. ఉదయపురం నుండి కలిగొట్టు గ్రామం వరకు కోటి 30 లక్షల రూపాయలతో 3.5 కిలోమీటర్లు వరకు బీటీ రోడ్డు పునర్నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.