భూకంపం.. శిశువులను రక్షించిన నర్సులు

భూకంపం.. శిశువులను రక్షించిన నర్సులు

పశ్చిమ బెంగాల్‌లో నిన్న 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూప్రకంపనలతో అసోం నాగావ్ ఆసుపత్రి కుదుపులకు గురైంది. ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న నర్సులు అక్కడ చికిత్స పొందుతున్న శిశువులను రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆపద కాలంలో చురుకుగా ప్రవర్తించి చిన్నారులను రక్షించిన నర్సులకు నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.