కుక్కల దాడిలో జింక పిల్ల మృతి

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని నంబర్-2 ఇంక్లైన్ గోల్ బంగ్లా బస్తీ వెనకాల అటవీ ప్రాంతంలో జింక పిల్లలు సంచరిస్తండగా వాటిపై వీధి కుక్కలు దాడి చేశాయి. జింకలు ప్రాణభయంతో పరుగులు పెట్టగా వాటిలో ఒక దాన్ని కుక్కలు పట్టుకొని చంపేశాయి. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.