VIDEO: వరల్డ్ వాటర్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల

ప్రకాశం: కరువు పీడిత ప్రాంతంలో వర్షపు నీటిని ఒడిసి పట్టాలనే ఉద్దేశంతో పొలాలలో నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో వరల్డ్ వాటర్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో మండలంలో 220 నీటి కుంటలు మంజూరు అయినట్లు తెలిపారు.