విధుల్లో నిర్లక్ష్యం టీచర్ సస్పెండ్

విధుల్లో నిర్లక్ష్యం టీచర్ సస్పెండ్

GDWL: రాజోలి మండలం చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలలో విధులకు నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయుడు రవిచందర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటించారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్, వారిపట్ల దురుసుగా ప్రవర్తించడం, పాఠశాలలో మద్యం సేవించడం వంటివి కలెక్టర్ తనిఖీల్లో వెల్లడయ్యాయి. దీంతో ఆయన రవిచందర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.