VIDEO: గంగానమ్మ తల్లి గుడిలో భక్తుల రద్దీ

VIDEO: గంగానమ్మ తల్లి గుడిలో భక్తుల రద్దీ

GNTR: తెనాలి గంగానమ్మపేటలో గ్రామ దేవతగా వెలసిన శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఎంతో విశేషమైన శ్రావణ మాసం కావడంతో ఉదయం నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి పొంగళ్లు, నైవేద్యం, నిమ్మకాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు శ్రీ గంగానమ్మ తల్లికి విశేషంగా అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు చేశారు.