'తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు అందని ఫలాలు'

NLG: తెలంగాణ సాధించి దశాబ్ద కాలం గడుస్తున్నా ఉద్యమకారులకు ఎలాంటి ఫలాలు అందలేదని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి ఇంద్ర అన్నారు. మలిదశ ఉద్యమంలో పాల్గొని తాము ఉద్యోగ అవకాశాలు కోల్పోయామని, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు1969 ఉద్యమకారులకు ఇచ్చిన బెనిఫిట్స్ తమకు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.