డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను సందర్శంచిన సీపీఎం నేతలు

MHBD: తొర్రూర్ గోపాలగిరి రోడ్డులో పేదలకోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను శుక్రవారం సీపీఎం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీ.నాగయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా నేటికి పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్యం స్పందించి పేదలకు ఇళ్ల పంపిణీ చేయాలన్నారు.