మాజీ ఎంపీపీ సాయిబాబాను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
ASR: డుంబ్రిగూడ మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చట్టారి సాయిబాబా శుక్రవారం కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. అరకు గ్రామంలోని ఆయన నివాసంలో కుడికంటి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న సాయిబాబా ఆరోగ్యస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి పాల్గొనాలని ఆకాంక్షించారు.