అధికారులను అభినందించిన కలెక్టర్
కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతంగా నిర్వహించిన అధికారులను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అభినందించారు. శనివారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. హెలిపాడ్, రోడ్లు, పారిశుధ్యం, వసతి ఏర్పాట్లలో మంచి పని చేశారని పేర్కొన్నారు.