విద్యుత్ శాఖ ఉద్యోగిపై దాడి ..కేసు నమోదు
WGL: రాయపర్తి మండలం మైలారం విద్యుత్ సెక్షన్ పరిధిలోని కిస్టాపురంలో వ్యవసాయ విద్యుత్ బిల్లుల వసూళ్లకు వెళ్లిన జూనియర్ లైన్మెన్ శ్రీకాంత్‌పై మంగళవారం గ్రామానికి చెందిన గిరిజన రైతులు కున్సోత్ శ్రీనివాస్, శంకర్ నాయక్‌లు భౌతిక దాడి చేశారు. ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కేసు నమోదైంది. గాయపడిన శ్రీకాంత్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.