'మితిమీరి యాంటీ బయోటెక్స్ వాడడం తగ్గించాలి'
ELR: మితిమీరి యాంటీ బయోటెక్స్ వాడడం ద్వారా పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యాధికారి డాక్టర్ శ్రీదివ్య అన్నారు. పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ A.M.Rపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యాంటీ బయోటిక్స్ వాడకం తగ్గించాలి అని, అవి ఎక్కువగా తీసుకోవడం వల్లన వచ్చే దుష్ప్రభావాలు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య ఉన్నత అధికారలు తదితరులు పాల్గొన్నారు.