పడమటి అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
NRPT: నూతన తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున అతి పురాతన పడమటి అంజన్న స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. పండుగ సందర్భంగా ఆలయ ధర్మకర్త ప్రాణేశ చారి, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం షడ్రుచులతో తయారుచేసిన పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు.