ప్రతి హామీ నెరవేర్చుతాం: శ్రీధర్ బాబు
TG: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేర్చుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.