అనపర్తిలో ఈ నెల 23న మెగా జాబ్ మేళా
E.G: అనపర్తిలో నవంబర్ 23 ఆదివారం వికాస ఆధ్వర్యంలో సుమారు 33 MNC కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆవిష్కరించిన ఆమె, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కంపెనీలు 1,200 ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయన్నారు.