భూమి గొడవతో మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్యాయత్నం
WGL: వర్ధన్నపేట మండలం రాంధాన్ తండాలో భూమి విషయంలో తండ్రి, సోదరులతో జరిగిన గొడవతో శనివారం పెద్ద కుమారుడు గుగులోతు రమేష్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.