జిల్లాలో కొత్త ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

జిల్లాలో కొత్త ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కడప జిల్లాలో విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు హెటిరో సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలోని కొండాపురం మండలం టి. కోడూరులో 30 ఎకరాలు, చామలూరు గ్రామంలో 10 ఎకరాలు, కొప్పోలులో 5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎకరాకు ఏడాదికి రూ. 3 లక్షలు లీజు ప్రాతిపాదికన భూములు కేటాయించారు.