జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా తాండ్ర నారాయణస్వామి
యాదాద్రి: జిల్లా సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షుడిగా గుండాల మండలం కొమ్మాయిపల్లి సర్పంచ్ తాండ్ర నారాయణ స్వామి ఎన్నికయ్యారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫోరమ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సాదాని భూమన్న యాదవ్, జిల్లా అధ్యక్షుడు కొప్పుల వెంకట్ రెడ్డి ఆయనను అభినందించారు.