VIDEO: రూ.25 లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థాపన
కోనసీమ: అంతర్వేదిలో రెండు రోడ్ల అభివృద్ధి పనులకు గురువారం రాజోలు MLA దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. R&B రోడ్డు నుంచి కలిదిండివారి మెరక వరకు రూ.25 లక్షలు వ్యయంతో నిర్మించబోయే బీటీ రోడ్డుకు భూమి పూజ చేశారు. మరో రూ.25 లక్షలతో నిర్మించనున్న రోడ్డుకు కూడా శంకుస్థాపన చేశారు. అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, రోడ్లను తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.