కేజీబీవీలో స్పాట్ అడ్మిషన్లు

BDK: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, కళాశాల నందు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఈనెల 22న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలిపారు. గ్రూపుల వారీగా ఖాళీల వివరాలు సీఈసీ-30 ఖాళీలు, ఎంపీహెచ్ డబ్ల్యూ- 20 ఖాళీలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.