రేపు వంగూరుకు రానున్న మంత్రి

NGKL: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రేపు అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రానికి రానున్నారు. మండల కేంద్రంలో గెలువలాంబ మాత బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న బోనాల వేడుకలలో ఆమె పాల్గొంటారు. అనంతరం జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.