గజపతినగరంలో ప్రతిరోజు ప్రజా దర్బార్
VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు గజపతినగరం మండలం టిడిపి కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువారం AMC చైర్మన్ P. V. V. గోపాల్ రాజ్ తెలిపారు. అందులో భాగంగా పలు గ్రామాల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గజపతినగరం మండలం టీడీపీ పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ తదితరులు పాల్గొన్నారు.