ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా మహాయజ్ఞం

HYD: కవాడిగూడ ఎన్టీఆర్ స్టేడియంలో షిర్డీ సాయిలక్ష్మి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. 999 హోమ గుండాలు ఏర్పాటు చేసి నిర్వహించిన ఈ వేడుకకు సాయి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. షిర్డీ సాయిబాబా లక్ష్మీబాయికి స్వయంగా ఇచ్చిన నాణేలను ప్రదర్శించారు. నిర్వాహకులు అరుణ్ షిండే గైక్వాడ్ పాటిల్, మాజీ మంత్రి గీతారెడ్డి, శైలజ మా షిండే గైక్వాడ్ పాటిల్ పాల్గొన్నారు.