ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అంగర రామ్మోహన్

ప.గో: మాజీ ఎమ్మెల్సీ పాలకొల్లు టీడీపీ నాయకుడు అంగర రామ్మోహన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో కలిసి వాలమర్రు గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకి టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు తెలపాలని కోరారు.