మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు

మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు

ASR: పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ జగదీశ్ నాయక్ అన్నారు. గురువారం ఆయన మారుమూల గ్రామాలైన చల్దిగెడ్డ, కొత్తపల్లి గ్రామాలకు సిబ్బందితో కలిసి కాలినడకన వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించారు. 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించామని ఆయన తెలిపారు.