మహిళ మృతి.. అనుమతి లేకుండా పోస్టుమార్టం

మహిళ మృతి.. అనుమతి లేకుండా పోస్టుమార్టం

వరంగల్: పదిరోజుల క్రితం మిల్స్ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుజాత అనే మహిళ గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, కుటుంబ సభ్యుల సంతకం లేకుండానే పోస్టుమార్టం నిర్వహించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై వారు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కార్యాలయం ముందు నిరసన దిగినట్లు స్థానికులు తెలిపారు.