ఐస్ క్రీమ్ వాహనాలకు నో ఎంట్రీ... ఫ్లెక్సీలు ఆవిష్కరణ
JGL: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఐస్ క్రీమ్ విక్రయించే బైకులు, ఆటోలకు నో ఎంట్రీ అంటూ సోమవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. గ్రామంలో ఐస్ క్రీమ్ విక్రయించే వాహనాలు తిరిగితే రూ.5 వేలు జరిమానా విధిస్తామంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఏఈ, సర్పంచ్, నాయకులు ఆవిష్కరిచారు.